కసింకోట జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు ప్రమాదం

అనకాపల్లి: జిల్లాలోని కసింకోట జాతీయ రహదారిపై గుడివాడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 7 గురికి తీవ్ర గాయాలు అవడంతో క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు ఈ ఘటనపై కసింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.