విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది: స్వప్న కుమారి
ASR: మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్న కుమారి రంపచోడవరం ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె తెలిపారు. పూర్తి స్థాయి వైద్య సహకారం అందుతోందని ఆమె స్పష్టం చేశారు.