నేడు ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలు

నేడు ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలు

GNTR: తెనాలి మార్కెట్ యార్డులో ఇవాళ ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నిన్న15కు పైగా ఒంగోలు జాతి ఆవులు యార్డుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పశు వైద్య అధికారులు మాట్లాడుతూ.. ఈ పోటీలు ఇవాళ సాయంత్రం వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలకు వచ్చిన ఆవులను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వస్తున్నారు.