RGIAలో పేలిన సెల్ ఫోన్ బ్యాటరీ

RGIAలో పేలిన సెల్ ఫోన్ బ్యాటరీ

HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి బ్యాగులో సెల్ ఫోన్ బ్యాటరీ పేలింది. సదరు ప్రయాణికుడు రాయ్‌పూర్‌ వెళ్లేందుకు శంషాబాద్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీఐఎస్ఎఫ్ పోలీసులు లగేజీ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా ఫోన్ బ్యాటరీ పేలడంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.