'పంట నష్టపోయిన రైతులకు పరిహారం'

'పంట నష్టపోయిన రైతులకు పరిహారం'

VZM: మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. తెర్లాం మండలంలో నష్టపోయిన పంటలను బుధవారం పరిశీలించారు. వర్షాలకు వరిపంట, కూరగాయలు, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం జరిగితే వ్యవసాయ, రెవిన్యూ అధికారులకు చెప్పాలని రైతులకు సూచించారు. రైతులందరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.