ప్రమాణ స్వీకారం ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
BHNG: ఈ నెల 16 తేదీన ఉదయం 11 గంటలకు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక, కౌన్సిలర్లకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదివారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తం ఉండాలన్నారు.