VIDEO: మేడారం జాతరలో చోరీల కలకలం

VIDEO: మేడారం జాతరలో చోరీల కలకలం

MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో చోరీలు కలకలం రేపుతున్నాయి. నేడు జంపన్నవాగు వద్ద ఓ మహిళ మెడలోని రెండు తులాల పుస్తెల తాడును మహిళా దొంగ అపహరించినట్లు బాధితులు తెలిపారు. జాతర ప్రాంగణంలో పర్సులు, నగదు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాల చోరీలు పెరుగుతుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు.