చీటింగ్ కేసులో టెక్కలి వాసి అరెస్ట్

చీటింగ్ కేసులో టెక్కలి వాసి అరెస్ట్

SKLM: పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2014లో నమోదు అయిన చీటింగ్ కేసులో టెక్కలి మండలం లింగాలవలసకు చెందిన వై. గోపీని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మధుసూదనరావు తెలిపారు. గోపీ, పాతపట్నం గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకి స్థలం అమ్ముతున్నట్లు నమ్మబలికి నకిలీ అగ్రిమెంట్ చూపించి టోకెన్ నగదు తీసుకున్నట్లు ఫిర్యాదులో ఉన్నట్లు తెలిపారు.