షేక్‌పేట్ వంతెనపై నీరు నిలవకుండా జీహెచ్ఎంసీ చర్యలు

షేక్‌పేట్ వంతెనపై నీరు నిలవకుండా జీహెచ్ఎంసీ చర్యలు

HYD: భారీ వర్షాలకు షేక్‌పేట్ వంతెనపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వంతెనపై ఉన్న వర్షపు నీటిని కిందకు పంపించే పైపులు పూడికతో మూసుకుపోవడమే దీనికి కారణం. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి పూడికతీత పనులు చేపట్టారు. దీంతో వంతెనపై నిలిచిన నీరు కిందకు వెళ్లిపోయి వాహనదారులకు ఊరట లభించింది.