ఎల్‌వోసీ లేఖ అందజేసిన డిప్యూటీ స్పీకర్

MHBD: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన బాలెం వీరన్నకు వైద్యసేవలకోసం ప్రభుత్వం తరుపున రూ.2.50 లక్షల ఎల్‌వోసీ లేఖను డిప్యూటీ స్పీకర్ రాంచందర్ నాయక్ సోమవారం అందజేశారు. డోర్నకల్ క్యాంప్ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య చికిత్సకు మరో మారు అవసరం ఉంటే తనని కలవాలని కోరారు.