విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

ELR: ముసునూరు మండలం రమణక్కపేట జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు మంగళవారం విలువలు పెంపొందించే పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం పసుమర్తి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన అమృత ధార, సద్గుణ సారం, సూక్తి సుధ, తోరణాలు వంటి పుస్తకాలను విద్యార్థుల జీవితాలకు ఎంతగానో ఉపకరిస్తాయి అన్నారు.