గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం విజ్ఞప్తి

గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం విజ్ఞప్తి

PLD: సుమారు 60 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి ఆదివారం ఉదయం మార్టూరు కూరగాయల మార్కెట్ వద్ద అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించినట్లు సమాచారం. పోలీసులు వాహనానికి సంబంధించిన అడ్రస్ పరిశీలించగా అది పల్నాడు జిల్లా, చిలకలూరిపేట, ఎన్టీఆర్ కాలనీకి చెందినదిగా తెలిసింది. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే మార్టూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.