స్క్రబ్ టైఫస్.. అక్కడ ఉండేవారు జాగ్రత్త!

స్క్రబ్ టైఫస్.. అక్కడ ఉండేవారు జాగ్రత్త!

AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం రేపుతున్నాయి. చెట్లు, వ్యవసాయ భూముల దగ్గర నివసించే వారిలో ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రివేళల్లో కుట్టే పురుగుల ద్వారా వ్యాధి వ్యాపిస్తోందని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. తడి నేలల్లో పని చేసేవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.