వీధి కుక్కలు, కోతుల దాడిలో చిన్నారికి గాయాలు

వీధి కుక్కలు, కోతుల దాడిలో చిన్నారికి గాయాలు

KMM: వీధి కుక్కలు, కోతుల దాడిలో ఓ చిన్నారికి గాయాలైన ఘటన శుక్రవారం ముదిగొండలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల వయసు కలిగిన చిన్నారిపై కోతులు వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుక్కలు, కోతులు బెడద నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరారు.