బొందంగూడలో మానవ హక్కుల అవగాహన

బొందంగూడలో మానవ హక్కుల అవగాహన

ASR: అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ పరిధి బొందంగూడలో హ్యూమన్‌ రైట్స్‌ ఆంధ్ర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులకు హక్కులు, చట్టాలు, విద్య, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం గిరిజనులకు పలు అవసరమైన వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు.