ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం పుట్టపర్తి క్రాస్ రోడ్డు వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.