పెనుకొండలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని జైన్ టెంపుల్ రోడ్డులో గుంతలు పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మంత్రి సవిత సీసీ రోడ్డు పనులకు రూ. 6 లక్షల నిధులను కేటాయించారు. శనివారం సీసీ రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ సతీష్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, త్రివేంద్ర, తదితరులు పాల్గొన్నారు.