పులివెందులలో ఎరువులు సీజ్

KDP: పులివెందులలోని వివిధ ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి రూ. 47 లక్షలు విలువైన ఎరువులను సీజ్ చేసినట్లు పులివెందుల ఏడీఏ ప్రభాకర రెడ్డి తెలిపారు. పులివెందులలోని ఎరువుల దుకాణాలు, గోదాములను వ్యవసాయశాఖ, పోలీసు, విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. 7 దుకాణాలకు సంబంధించి లోపాలు ఉండడంతో మొత్తం రూ. 11 లక్షలు విలువైన ఎరువులను సీజ్ చేశారు.