పాము కాటుతో బాలుడు మృతి
SDPT: మర్కుక్ మండలం యూసుఫ్ ఖాన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుతో ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. ఇంటి వద్ద ఆడుకుంటుండగా పాము కాటుకి గురై అపస్మారక స్థితికి వెళ్లిన బాలుడిని గమనించిన తల్లిదండ్రులు ఎర్రవల్లి, గజ్వేల్ ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ములుగు ఆర్వీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.