VIDEO: ఈదురు గాలులతో వర్షం

NLG: దేవరకొండ పట్టణంతో పాటు, మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, సాయంత్రానికి ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో బలమైన ఈదురు గాలులతో వర్షం కురుస్తుండడంతో గ్రామాల్లో రైతులు అకాల వర్షంతో పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు.