VIDEO: మోరీలు తీయడం మరిచిన మున్సిపల్ సిబ్బంది

VIDEO: మోరీలు తీయడం మరిచిన మున్సిపల్ సిబ్బంది

WGL: GWMC 19 డివిజన్ కాశీబుగ్గలోని బంగారు మైసమ్మతల్లి గుడి పరిసర ప్రాంతాల్లో మోరీల పరిస్థితి ఇది. గత నెలరోజుల నుంచి ఈ ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది మోరీలు తీయడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మోరి నిండా చెత్త పేరుకుపోయి, పిచ్చిమొక్కలు పెరిగి దోమల బెడద ఎక్కువ అయిపోయిందని వాపోతున్నారు. మున్సిపల్ సిబ్బంది స్పందించి, సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.