అగ్ని ప్రమాదంలో హోటల్ దగ్ధం
E.G: గోకవరం మండలం తంటికొండ కోనేరు గట్టు వద్ద ఉన్న ఓ హోటల్ బుధవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో టిఫిన్ తయారీ వస్తువులతో పాటు వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో హోటల్ యజమాని ఆస్తులన్నీ బూడిదయ్యాయి.