జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నఎంపీ
ADB: భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో పోరాడి అమరుడైన గొప్ప నాయకుడు భగవాన్ బీర్సా ముండా అని కొనియాడారు.