మరిడమ్మ తల్లికి బోనం సమర్పణ

మరిడమ్మ తల్లికి బోనం సమర్పణ

కాకినాడ: పెద్దాపురం మరిడమ్మ ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా గురువారం మహారాణి సత్రం వీధికి చెందిన మహిళలు మరిడమ్మ అమ్మవారికి భోనం సమర్పించారు. మహారాణి సత్రం వీధి నుంచి మహిళలు బోనాన్ని తలపై పెట్టుకుని పట్నం పురవీధులగుండా ఊరేగిస్తూ మరిడమ్మ తల్లి ఆలయానికి చేరుకొని భోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.