కార్మికులు నమోదు చేసుకోవాలి: కలెక్టర్
పల్నాడు జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కార్మికులు సమీప కార్మికశాఖ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. నమోదు చేసిన వారికి వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు.