అప్పుల బాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
KMM: ఎర్రుపాలెం మండలం సకినవీడు గ్రామానికి చెందిన గురువారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు నేడు తెలిపారు. మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు కన్నీరు మున్నేరు అవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.