బీసీ కాలనీలో తాగు నీటి సమస్య!

WGL: నల్లబెల్లి మండల పరిధి ఆర్కపల్లి బీసీ కాలనీలో రెండు నెలల నుంచి తాగునీటి సమస్య నెలకొందని ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని సంబంధిత మండల పంచాయతీ అభివృద్ధి అధికారికి చెప్పిన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.