ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
ADB: భోరజ్ మండలం బాలాపూర్‌లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం సర్పంచ్ రావుత్ అచ్యుత్ పలు కాలనీల్లో పర్యటించి మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగింపజేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా మల్టీపర్పస్ వర్కర్స్ రామన్న హనుమాన్లులకు సూచించారు.