వినియోగించుకుంటేనే ఉపయోగం: అక్షర

వినియోగించుకుంటేనే ఉపయోగం: అక్షర

GDWL: ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా, వాటిని వినియోగించుకోకపోతే ఉపయోగం లేదని ఆలూరు మహిళా సంఘం అధ్యక్షురాలు అక్షర పేర్కొన్నారు. సోమవారం గట్టు మండలం ఆలూరు గ్రామంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు అన్నిటిని వినియోగించుకోవాలని తెలిపారు.