జిల్లా కమిటీలో సముచిత స్థానం: నాగం వర్షిత్ రెడ్డి

NLG: బీజేపీ జిల్లా కమిటీలో బీసీ, ఎస్సీ, STలకు 70 శాతం సముచిత స్థానం కల్పించడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో నూతనంగా నియమితులైన పదాధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.