పలు బ్యాంకులను పరిశీలించిన కాజీపేట పోలీసులు

HNK: కాజీపేట పట్టణంలోని ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకు, కరుర్ వైశ్యా బ్యాంకులను గురువారం కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై శివ కృష్ణలు క్షుణ్ణంగా పరిశీలించారు. పలు బ్యాంకుల లాకర్ సిస్టమ్, అలారం సిస్టమ్, సెక్యూరిటీ అరేంజ్ మెంట్, సీసీ కెమెరాల తదితర అంశాల ఏర్పాటుపై బ్యాంకు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.