'ఉద్యోగులందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి'
JGL: జిల్లాస్థాయి అధికారులతో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి సోమవారం సాయంత్రం వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జనాభా లెక్కల - స్వీయ గణన -2027 పై అధికారులకు డెమో తరగతులు నిర్వహించారు. అలాగే 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా బాలల పరిరక్షణ, డ్రగ్స్ రహిత సమాజం కార్యక్రమాలు పోస్టర్‌ను ఆవిష్కరించారు.