పోరంబోకు భూమిలో ప్రహరీ గోడ కూల్చివేత

తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామ సర్వే నంబర్ 228లోని కాలువ పోరంబోకు భూమిలో కొందరు ఆక్రమణదారులు ప్రహరీ గోడ నిర్మించడానికి ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని, వీఆర్ ఎం. వలర్మతి, తహసీల్దార్ రామాంజుల నాయక్ ఆదేశాల మేరకు గోడను కూల్చివేశారు. కాలువలపై ఎలాంటి ఆక్రమణలను సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.