తల్లీకొడుకులకు ఏడేళ్ల జైలుశిక్ష
ములుగు జిల్లాలో వివాహిత ఆత్మహత్యకు కారణమైన కేసులో ఇద్దరు నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి చంద్రకళ తుది తీర్పు ప్రకటించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపిన వివరాల ప్రకారం.. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసు తల్లీకొడుకులు దోషులుగా తేలడంతో శిక్ష విధించింది.