ప్రభాస్ 'స్పిరిట్'లో బాలీవుడ్ బ్యూటీ?
ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాల 'స్పిరిట్' మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో మేకర్స్ స్పెషల్ సాంగ్ డిజైన్ చేసారట. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ నటి హుమా ఖురేషిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ పాటతో పాటు ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నారట.