ఘనంగా కట్ట మైసమ్మ 15వ వార్షికోత్సవం

NZB: బోధన్ పట్టణంలోని బైపాస్ ప్రాంతంలో గల కట్ట మైసమ్మ మందిరం యొక్క 15వ వార్షికోత్సవంను మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చి రైతులకు పాడిపంట ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని ఆలయ అర్చకులు ఉద్మీర్ సాయిలు అన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి కౌన్సిలర్ శరత్ రెడ్డి, మాసుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.