కట్నం అడిగాడని.. పెళ్లి పీటల మీద షాక్ ఇచ్చిన వధువు
యూపీలోని బరేలీలో ఓ వరుడికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పెళ్లి కోసం 20 లక్షల కట్నం, బ్రెజా కారు కావాలని వరుడు డిమాండ్ చేశాడు. ఇది విని వధువు కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. తన తల్లిదండ్రుల నిస్సహాయతను చూసి తట్టుకోలేకపోయిన ఆ అమ్మాయి.. 'నీతో పెళ్లి వద్దు.. ఏమీ వద్దు' అని తెగేసి చెప్పింది. ఆ అమ్మాయి ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.