సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్
NZB: భూ భారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.