పత్తిమిల్లు వద్ద ఆందోళన చేస్తున్న రైతులు
NLG: కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లిలోని శివ గణేష్ పత్తి మిల్లు వద్ద రైతులు ఆందోళన చేశారు. తేమ శాతం పేరుతో పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. రోజులు తరబడి మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పినట్లు 20% తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వాలను కోరారు.