VIDEO: 'ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం'
E.G: బిక్కవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే ప్రహరీ గోడ నిర్మించాలని అనపర్తి EX MLA సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, రోగుల భద్రత, ఆసుపత్రి ఆస్తుల రక్షణ కోసం గోడ నిర్మాణం అత్యవసరమన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు.