పేకాట శివరం పై దాడి.. ముగ్గురు అరెస్ట్
E.G: గోపాలపురం మండల పరిధిలోని కోమటికుంట గ్రామ శివారులో ఆదివారం జూదం ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగేశ్వరనాయక్ ఆదివారం తెలిపారు. డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టి జూదం ఆడుతున్న వారిని గుర్తించారు. డ్రోన్‌ను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.