భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: మంత్రి

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: మంత్రి

BHPL: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయ మాడవీధుల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని, ఐనవోలు, కొమురవెల్లి సహా అన్ని ఆలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టామన్నారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.