ఎస్టీ హాస్టల్‌లో సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ తనిఖీ

ఎస్టీ హాస్టల్‌లో సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ తనిఖీ

GDWL: జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌ను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఛైర్‌పర్సన్ సహదేవుడు, డీసీపీయూ కౌన్సిలర్ సురేష్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు హాస్టల్‌లోని మౌలిక వసతులు, ఆహార నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలను వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన విద్యార్థులను వ్యక్తిగతంగా పరామర్శించారు.