కదిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ వ్యక్తి మరణానికి కారణాలు వడదెబ్బతో పాటు ఇతర కారణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.