VIDEO: గన్నవరంలో సినీ నటుడు జగపతిబాబు సందడి

VIDEO: గన్నవరంలో సినీ నటుడు జగపతిబాబు సందడి

కృష్ణా: హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు చేరుకున్నాడు. ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారి దొప్పలపూడి ప్రవీణ్ శాలువా కప్పి బొకే అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రవీణ్ నివాసానికి వెళ్లిన జగపతిబాబు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చి హీరోతో ఫోటోలు దిగుతూ సందడి చేశారు.