దొంగతనాల నివారణకు ఎస్సై సూచనలు

GNTR: మంగళగిరి మండలంలో దొంగతనాలు పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ఆదివారం సూచించారు. తీర్థయాత్రల కోసం ఇంటిని ఖాళీ చేయాలంటే LHMS సేవలు వినియోగించాలని, 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనాలను హ్యాండిల్ లాక్, గొలుసుతో బంధించాలని కోరారు.