మరికాసేపట్లో ముగియనున్న ఎన్నిక ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలివెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్‌లు, పబ్బులు మూసివేయాలని ఈసీ ఆదేశాలను విడుదల చేసింది. కాగా, ప్రచార సమయం చివరికి చేరడంతో BRS నుంచి KTR, కాంగ్రెస్ నుంచి CM రేవంత్ సహా పలువురు నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.