ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
VKB: తాండూరు మండలం చెంగోల్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. అయితే స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులకు మహిళా సంగీత కళాకారుల భజన గీతాలు చూసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలిపారు. అనంతరం స్వామివారికి భక్తులు పూజలు చేసి అన్నప్రసాద వితరణ చేపట్టారు. పోలీసులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.