డీఎంహెచ్‌వో కార్యాలయంలో సాయిబాబా శత జయంతి వేడుకలు
సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో డా. ఎస్. ఫైరోజాబేగం ఆధ్వర్యంలో సత్యసాయి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బాబా అందించిన 'మానవసేవే మాధవ సేవ', 'అందరినీ ప్రేమించు' అనే సూక్తులను గుర్తు చేసుకున్నారు. సిబ్బంది అంతా బాబా స్ఫూర్తితో ఉచిత విద్య, వైద్య సేవలను విధి నిర్వహణలో పాటించాలని డీఎంహెచ్‌వో సూచించారు.