ములుగు డిగ్రీ విద్యార్థినిలకు అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్
ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 4 విద్యార్థినిలకు అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్ లభించింది. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ. 30 వేలు చొప్పున 3 ఏళ్లలో రూ. 90 వేలు అందనుంది. జయశ్రీ, మౌనిక, శ్రేయ, అఫ్రీన్‌ల ఖాతాల్లో తొలి విడత జమైంది. మెరిట్ ఆధారంగా ప్రభుత్వ విద్యార్థినిలకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం అభినందించారు.